అంశాలు, జాగ్రత్తల గురించి ఈ క్రింద తెలియజేయడం జరిగినది.*
TECHNICAL
………………………
S. S లో PTR ని కాపాడే పరికరం బ్రేకర్.
👍PTR ఫెయిల్ కావటానికి ఎక్కువగా ఉండే కారణం fault కరెంట్ తీసుకోవడమే.
Breaker healthy గా వున్నప్పుడు 50 నుండి 150, 200 మధ్యలో కరెంట్ flow ఉంటుంది, అదే fault కరెంట్ వస్తే, PTR లోకి కనీసం 300నుండి 1000Amps fault కరెంట్ ఉంటుంది.
👍అదే ఎక్కడైనా phase to phase అయితే 2000amps fault కరెంట్ flow అవుతుంది.
👍పిడుగులు పడినప్పుడు PTRలోకి 3000amps fault కరెంట్ తీసుకుంటుంది.
👍ఉరుములు మెరుపులతో, పిడుగులు పడే ఆవకాశం వున్నప్పుడు తప్పనిసరిగా అన్ని బ్రేకర్ లు ట్రిప్ చేసి, AB స్విచ్ లు ఓపెన్ చేయాలి.
👍L C లు ఇచ్చేటప్పుడు, ఒక్కో సారి మీ పై అధికారులు ట్రిప్ చేయి చాలు అన్నాకానీ, ట్రిప్ తో పాటు AB స్విచ్ లు ఓపెన్ చేయాలి.
👍బ్రేకర్ ట్రిప్ లో వున్నా కానీ, కరెంట్ వస్తుందని అనుకుంటే బహుశా limb అయినా ఫెయిల్ అయి ఉండొచ్చు.
👍 breakar లో LIMB కు మధ్యలో వుండే గ్యాప్ 5MM మాత్రమే.
👍బ్రేకర్ ట్రిప్ అయినప్పుడు, fault కరెంట్ 1000నుండి ఆపైన 2000, 3000లు amps వచ్చినప్పుడు, వెంటనే AE గార్కి తెలియజేయాలి.
తప్పనిసరిగా లైన్ పెట్రోలింగ్ చేశాకనే, AE గారు చెబితేనే ఆన్ చేయాలి.
👍ఎప్పటి కప్పుడు DC బ్యాటరీ voltage చెక్ చేసుకోవాలి. DC Voltage 25 కు తగ్గకుండా చూసుకోవాలి.
DC బ్యాటరి కరెక్ట్ గా పనిచేస్తుందో, లేదో తెలుసుకోడానికి, AC supply off చేసి, బ్రేకర్ లో healthy బటన్ ప్రెస్ చేసి, బల్బు వస్తుందో, లేదో, చెక్ చేయాలి. Healthy బల్బు వెలగకుంటే, ఆ DC బ్యాటరి లో సమస్య ఉందని అర్ధం. వెంటనే AE గారికి తెలియజేయాలి.
👍ప్రతి గంటకొకసారి 3ఫేస్ కరెంట్, 3ఫేస్ voltage చెక్ చేసుకోవాలి.
👍బస్ కేబుల్ నుండి PT కి వచ్చే cable ఎక్కడైనా ఫెయిల్ ఐనా, shot ఐనా PT బ్లాస్ట్ అవుతుంది.
బ్రేకర్ లో PT fuse లు 4 ఉంటాయి, అవి E కోడ్ మీద ఉంటాయి.
👍బ్రేకర్ లో healthy bulb రాకపోవడానికి కారణం DC supply రాకపోవడం కూడా కావచ్చు.
👍ఎప్పటి కప్పుడు relay లో display వస్తుందో, లేదో చూడాలి.
👍D C బ్యాటరి పని చేయటం లేదంటే, AC జంక్షన్ box నుండి వచ్చే కేబుల్ fail లేదా షాట్ అయినట్లుగా భావించాలి.
👍DC బ్యాటరీ లో display రాకుంటే, బ్యాటరి charger లో ఉన్న push బటన్ ప్రెస్ చేస్తే, voltage ఎంత వస్తుందో తెలుస్తుంది.
👍D C సప్లై వస్తుందో, లేదో బ్రేకర్ లో చూడటానికి, బ్రేకర్ లో ఉన్న fuse లలో జె,కె సిరీస్ లో చూడాలి.
👍D C supply బ్రేకర్ లో ఉన్న ట్రిప్ కాయల్ పనిచేయడానికి, బ్రేకర్ లో ఉన్న రిలే నిరంతరం పనిచేయడానికి ఉపయోగ పడుతుంది.
👍A C supply DC బ్యాటరి ఛార్జ్ చేసుకోడాని, లైటింగ్ కోసం ఉపయోగ పడుతుంది.
👍ఒక్కోసారి fault లేకున్నా, బ్రేకర్ ట్రిప్ అవుతున్నప్పుడు, బ్రేకర్ ఆఫ్ చేసి, AB స్విచ్ లు ఓపెన్ చేసి, తిరిగి బ్రేకర్ ను ఐడిల్ గా ఆన్ చేయాలి.అప్పుడు లైన్ fault వుందా? బ్రేకర్ fault ఉందో తెలుస్తుంది.
👍లైన్ fault వున్నా, మరే fault వున్నా, బ్రేకర్ ని ఎక్కువ సార్లు ఆన్ చేస్తే PTR ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ PTR ఫెయిల్ అయితే, మీరు ఎన్ని సార్లు fault మీద బ్రేకర్ ని ఆన్ చేశారో, రిలే లో తెల్సిపోతుంది కావున, AE గారి పర్మిషన్ లేకుండా ఆన్ చేయొద్దు. ఆన్ చేస్తే, మీ ఉద్యోగానికి ఇబ్బంది.
👍కెపాసిటర్ ఆఫ్ చేసినా, దానికున్న సెల్స్ లోని కరెంట్ దాదాపుగా 6గంటల తర్వాతనే discharge అవుతుంది, కావునా, ఆ 6గంటలవరకు కెపాసిటర్ మీద పని చేయొద్దు.
రిలే లో ఉన్న పవర్ బటన్ లో గ్రీన్ బల్బు వెలిగితేనే ఆ రిలే ఓ.కె. ఉన్నట్లు.
👍బ్రేకర్ ట్రిప్ అయినప్పుడు, రిలే సెట్ చేయకుండా, ఆన్ చేస్తే, బ్రేకర్ ఆన్ అవుతుంది కొన్ని బ్రేకర్ లలో, కానీ, తరువాత fault మీద బ్రేకర్ ట్రిప్ అవదు. కావునా ట్రిప్ ఐన ప్రతిసారి రిలే సెట్ చేశాకనే, ఆన్ చేయాలి.
👍బ్రేకర్ ట్రిప్ ఐన ప్రతిసారి, బ్రేకర్ లో fault కరెంట్ ఎంత ఉందో, చూసి వెంటనే AE గారికి తెలియ జేయాలి.
👍STEL MECH రిలే లో display రాకుంటే, DC వస్తుందో, లేదో తెలుసుకోడానికి, 1 నుండి 28 వరకున్న కాంటాక్ట్ లలో 27,28 కెబుల్ లలో టాంగ్ టెస్టర్ ద్వారా, పవర్ వస్తుందో, లేదో, తెలుసుకోవచ్చు.
👍STEL MECH రిలే లో R, Y, B, E ఫేస్ లు ఉంటాయి.
👍స్టెల్ మేక్ రిలే లో లోడ్ చూడాలంటే, రీసెట్ బటన్ press చేస్తే వస్తుంది.
👍స్టెల్ మేక్ రిలే కు S1, S2 సీరీస్ కాంటాక్ట్ లుంటాయి.
👍R ఫేస్ రిలే లో S1,S2 కాంటాక్ట్ కేబుల్ ఉన్నాయో, లేదో చూడాలి,
Y ఫేస్ లో, S1 లో 5,6 కాంటాక్ట్ కేబుల్ లుంటాయి.
E ఫేస్ లో 13,14 కాంటాక్ట్ కేబుల్ లుంటాయి.
C G L relay
………………..
C G L రిలే లో D C supply వస్తుందో, లేదో చూడాలంటే, 17,18 కాంటాక్ట్ కు పవర్ వస్తుందో, లేదో చూడాలి.
👍C G L రిలే లో 1 నుండి 30 వరకు కాంటాక్ట్ లుంటాయి
👍.CGL రిలే లో పవర్ బటన్ లో గ్రీన్ బల్బు వస్తేనే, ఆ రిలే ఓ.కె ఉన్నట్లు.
👍CGL RELAY లో
IR 1 =R phase.
IR 2 =Y phase.
IR 3 = B phase.
I/0(I not) = టోటల్ కరెంట్.
C & S RELAY లో
………………………….
C & S రిలే లో display వస్తుందో, లేదో చూడాటానికి, B13, B14 సీరీస్ లో టాంగ్ టెస్టర్ ద్వారా పవర్ వస్తుందో, లేదో, తెలుసుకోవచ్చు.
👍C & S లో
L1 …..R ఫేస్
L2 …….y ఫేస్
L3 ……..B ఫేస్ లుంటాయి.
గౌరవ నీయులు DE సార్ గారు చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలు.
👍బ్రేకర్ ట్రిప్ ఐన ప్రతిసారి ఏ ఇండికేషన్ మీద ట్రిప్ అయింది, fault కరెంట్ ఎంతో చూసి, తప్పనిసరిగా AE గార్కి తెలియ జేయాలి, అలాగే, వాట్స్ ఆఫ్ గ్రూప్ లో పెట్టాలి
👍 బ్రేకర్ ట్రిప్ అయినప్పుడు రిలే లో fault కరెంట్ ఎక్కువగా వస్తే, ఆ లైన్ లో fault దగ్గరలోనే ఉండొచ్చు. కావునా లైన్ పెట్రోలింగ్ చేశాకనే, AE గారి పర్మిషన్ ఉంటేనే ఆన్ చేయాలి.
👍వర్షం, ఉరుములు, మెరుపులు, గాలి వస్తున్నప్పుడు, అన్ని ఫీడర్ లు ఆఫ్ చేసి, AB swich ఓపెన్ చేయాలి.
👍 ప్రతి ట్రిప్పింగ్ ను, నమోదు చేసి, మన వాట్స్ ఆప్ గ్రూప్ లో పెట్టాలి.
👍 బ్రేకర్ ట్రిప్ ఐనప్పుడు AE గారి పర్మిషన్ లేకుండా ఆన్ చేయొద్దు.
👍 L C ఇవ్వాల్సి వచ్చినప్పుడు, AE గారికి తెలియజేసి, AE గారు పర్మిషన్ ఇస్తేనే, బ్రేకర్ ఆఫ్ చేసి, AB స్విచ్ ఓపెన్ చేసి, LC బుక్ లో రాసి, నెంబర్ ఇచ్చి, ఎర్త్ లు వేసి, LC తీసుకునే వారికి LC నెంబర్ చెప్పి, టైం చెప్పి LC ఇవ్వాలి. వాట్స్ ఆఫ్ గ్రూప్ లో పెట్టాలి.
👍బ్రేకర్ ను ఎన్ని సార్లు టెస్ట్ చార్జ్ చేయవలసి వచ్చినా, తప్పని సరిగా b no AE గారి పర్మిషన్ తీసుకునే, ఆన్ చేయాలి.